హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొఱకు, దుష్టశిక్షణ కొఱకు విష్ణువు ఎన్నో ఆవతారాలలో యుగయుగాన
అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను "దశావతారాలు" అంటారు. దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీ నారసింహుడని అవతార మూర్తిని స్మరిస్తారు.
శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు, లక్ష్మీ నరసింహ స్వామి మొదలగు నామములతో మహావిష్ణువు నాల్గవ అవతారమును ఆరాధించుతారు.
32 నరసింహ దివ్య క్షేత్రాలు:
ఆంధ్ర ప్రదేశ్ లోని నరసింహ దివ్య క్షేత్రాలు:
1) అహోబిలం నరసింహ స్వామి ఆలయం, కర్నూలు జిల్లా. 2) కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, అనంతపురం జిల్లా.
2) వరాహ లక్ష్మీ నరసింహ ఆలయం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా.
3) శ్రీ పానకాల నరసింహ స్వామి ఆలయం. మంగళగిరి. గుంటూరు జిల్లా.
4) లక్ష్మీ నరసింహ ఆలయం, అంతర్వేది, తూర్పు గోదావరి జిల్లా.
5) శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, వేదాద్రి, చిల్లకల్లు, కృష్ణా జిల్లా.
6) కేతవరం లక్ష్మీనర్శిమ స్వామి ఆలయం, గుంటూరు జిల్లా.
వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం / నరసింహ కొండ, నెల్లూరు జిల్లా
తెలంగాణలోని దివ్య క్షేత్రాలు:
9) లక్ష్మీ నరసింహ ఆలయం, యాదాద్రి,
10) వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వజీరాబాద్, నల్గొండ జిల్లా.
11) మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, సూర్యాపేట జిల్లా.
కర్ణాటకలోని దివ్య క్షేత్రాలు:
12) సీబీ నరసింహ స్వామి ఆలయం, హోబ్లీ, బెల్లావి, కర్ణాటక
13) శ్రీ గురునరసింహ దేవాలయం సాలిగ్రామ, ఉడిపి, కర్ణాటక
14) మేలుకోటే చలువనారాయణ మరియు యోగ నరసింహ స్వామి, కర్ణాటక
15) దేవరాయనదుర్గ శ్రీ యోగ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, తుంకూరు, కర్ణాటక
16) శ్రీ ఆదిశంకరాచార్య శారద లక్ష్మీ నరసింహ పీఠం, చిక్కమగళూరు జిల్లా, కర్ణాటక
17) శ్రీ నర్సింహ జర్న మందిర్, బీదర్, కర్ణాటక
తమిళనాడులోని దివ్య క్షేత్రాలు:
18) శ్రీ యోగ నరసింహ స్వామి ఆలయం, షోలింగూర్, తమిళనాడు
19) నరసింహస్వామి ఆలయం, నమక్కల్, తమిళనాడు 20) పాటలత్రి నరసింహర్ లేదా ఉగ్ర నరసింహ ఆలయం కాంచీపురం, తమిళనాడు
20) శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం, అంతిలి, తమిళనాడు 22) పరిక్కల్ శ్రీ లక్ష్మీ నరశిమామూర్తి ఆలయం, విల్లుపురం, తమిళనాడు
21) పూవరసంకుప్పం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, విల్లుపురం, తమిళనాడు
22) సింగిరికుడి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, కడలూరు, తమిళనాడు
23) శ్రీ శరనారాయణ పెరుమాళ్ ఆలయం/తిరువతిగై నరసింహర్ ఆలయం, కడలూరు, తమిళనాడు
మహారాష్ట్రలోని దివ్య క్షేత్రాలు:
26) కోలే నర్సింగ్‌పూర్ జ్వాలా నరసింహ ఆలయం, నరసింగ్‌పూర్, మహారాష్ట్ర
27) నిరా నర్సింగ్‌పూర్ శ్రీ లక్ష్మీ నర్సింహ దేవాలయం, పూణే, మహారాష్ట్ర
28) శ్రీ నర్సింహ మందిర్ పోఖర్ని, మహారాష్ట్ర
ఒరిస్సాలోని దివ్య క్షేత్రాలు:
29) మర్జార కేసరి నరసింహ దేవాలయం, బరాఘర్, ఒరిస్సా
30) చక్ర నరసింహ ఆలయం, పూరి, ఒరిస్సా
పశ్చిమ బెంగాల్‌లోని దివ్య క్షేత్రాలు:
31) నరసింగపల్లి లార్డ్ నరసింహదేవ ఆలయం దేవపల్లి, పశ్చిమ బెంగాల్
ఉత్తరాఖండ్‌లోని దివ్య క్షేత్రాలు:
32) జ్యోతిర్ మఠం/నర్సింగ్ దేవతా ఆలయం జోషిమత్, చమోలి, ఉత్తరాఖండ్